రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియాను సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు సోమవారం చిత్తూరు తాసిల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు సిపిఐ సహాయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 80% మంది రైతులు వరి పంటపై ఆధారపడి ఉన్నారని ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.