Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మెప్మా కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మహిళా సంఘం సభ్యులు,జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు,మరియు డిఆర్డిఏ పిడి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ జుమ్లా నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం గల సాంకేతిక నిపుణులు అవసరమని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోఏటిసీలో అత్యధిక కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.ఈనెల 30వ తేదీ వరకు రోజువారిగా తక్షణ అడ్మిషన్లు కలవని,జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాలు పొందాలన్నారు.