అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం వంజపర్తి పంచాయతీ బలిజిపేట గేదెలబంద గ్రామాలు మీదగా వెళ్లే రహదారి నిర్మాణం చేపట్టాలని స్థానిక గ్రామస్తులు పాడేరు ఐటిడిఏ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాడేరు ఐటిడి యొక్క చేరుకున్న వారు మీడియాతో మాట్లాడారు. 2021 లో తమ గ్రామానికి రహదారి నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు తమ సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య కారణంగా డోలిమోతల ద్వారా వైద్యానికి మండల కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.