వైభవోపేతంగా, ప్రశాంతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి సమావేశం నిర్వహించారు.