అనంతపురం నగరంలోని పిటిసి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద నగరంలోని ఆరవ రోడ్డుకు చెందిన ఎస్ మొహమ్మద్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.