బాపట్ల జిల్లాలో ఎస్సీ ఎస్టీ మరియు విభిన్న ప్రతిభావంతుల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాపట్ల కార్యాలయం లో ఎస్సీ ఎస్టీ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. వివరణ ప్రతిభావంతులకు తిరిగి వెరిఫికేషన్ ద్వారా పింఛన్లు మంజూరు అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.