చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి గుర్ల మండలాల్లో బుధవారం మధ్యాహ్నం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీపురుపల్లి మండల కేంద్రంతో పాటు వంగపల్లి పేట. గుర్ల మండలం గుర్ల భూపాలపురం తదితర గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించిన కళ్యాణం జరిపించారు. సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.