ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమల గ్రామ సమీపంలోని ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయులు రమేష్ భార్య తీవ్రంగా గాయపడ్డారు. మరో బైక్ పై ఉన్న నాగేంద్ర అనే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలైన వారిని స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ను అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.