ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఎచ్చెర్లలోని మండలాల ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం రణస్థలంలోని రామతీర్థం జంక్షన్ వద్ద దర్నా నిర్వహించారు. మహిళలకు ఫ్రీ బస్ పథకంతో ఆటో, వ్యాన్, టాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రైవర్లకు ప్రత్యమ్నాయ మార్గం చూపాలని తెలిపారు.