గత రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ వినాయక విగ్రహం వద్ద భారీ గోడ కూలిపోయిన ఘటనలు ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో స్థానికంగా ఉన్న అనేక ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా పలు తోపుడుబండ్ల వ్యాపారులు నష్టపోయినట్లు తెలియజేశారు. అయితే గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని స్థానికులు చెబుతున్నారు. సుమారు 50 సంవత్సరాల పాత గోడ కావడంతో వర్షాలకు నానిపోయి పడిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు