సైక్లింగ్ తో శారీరిక దృఢత్వం కలుగుతుందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలో "ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీ విత్ డిస్టిక్ పోలీస్ ఫోర్స్" పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తోపాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ సైకిల్ ర్యాలీ ద్వారా పోలీస్ సిబ్బందిలో శారీరిక దృఢత్వం పెరుగుతుందన్నారు. రోజువారీ విధుల్లో చురుకుదనం, మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు.