పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం కడుపునొప్పితో రాము అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీఎం పాలెం లోని ఆర్ హెచ్ కాలనీ పార్కులు చెట్టుకు చున్నితో ఉరివేసుకొని మరణించినట్లు స్థానికులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంలో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు వివరాలు నమోదు చేసుకున్నారు. భార్య బిడ్డలకు మూడేళ్లుగా దూరంగా ఉంటున్న రాము కొడుకు ఇటీవల చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు మద్యం బానిస అయ్యాడు. శనివారం అతిగా మద్యం సేవించడంతో కడుపునొప్పి వచ్చింది తట్టుకోలేక ఉరి వేసుకున్నాడు.