వక్ఫ్ బోర్డ్ సంస్థల ఆస్తుల ఆక్రమణల వివరాలు నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులోనూ రికార్డులు సక్రమంగా ఉండేలా పారదర్శకత సాధ్యమవుతుందిని రాష్ట్ర వక్స్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ అలీ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో కర్నూలు,నంద్యాల ఉమ్మడి జిల్లా పరిధిలోని మస్జీదులు, దర్గాలు, ఆశూర్ఖానాలు, ఇతర వక్స్ సంస్థల వివరాలను ఉమ్మీద్ పోర్టల్ లో ఎంటర్ చేయడమే లక్ష్యంగా ఉమ్మీద్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.