నంద్యాల జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలోని వివిధ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించలేని నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ను తక్షణమే సస్పెండ్ చేయాలని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నాయకులు భార్గవ్, మధు, శేఖర్ మాట్లాడుతూ.. ప్రజల దాహార్తి తీర్చలేని కమిషనర్ ఎందుకని ప్రశ్నించారు. విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వారన్నారు.