బీహార్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబా మోదీపై రాహుల్ గాంధీ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు