ములుగు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో వినాయక మండపాలను ములుగు సిఐ సురేష్, వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు నేడు బుధవారం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు పరిశీలించారు. గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు తమ వివరాలను పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. గణేష్ మండపాల వద్ద నవరాత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించి, ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని అన్నారు.