భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన వ్యవసాయ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ. లక్ష నష్టపరిహాన్ని చెల్లించి ఆదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లాలోని వ్యవసాయ రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయారని అన్నారు.అదేవిదంగా ఇదే అదనుగా ఫర్టిలైజర్ దుకాణాలు, లిక్విడ్ దుఖణాలు ఎక్కువ ధరలకు రసాయనిక ఎరువులు, లిక్విడ్ లను విక్రయించి పేద రైతులను దండుకుంటున్నారని అన్నారు.బుధవారం ఆయన ఇటిక్యాల మండల పరిధిలోని మునుగాల, జింకలి పల్లి శివారులో దెబ్బ తిన్న పంట పోలాలను పరిశీలించారు.