అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో వినాయక చవితి నవరాత్రి ముగింపు ఉత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరిగిన పూజల అనంతరం గారడీ నృత్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలు, సన్నాయి వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, శక్తి వేషాలు, భక్తుల కోలాహలం, గరగ ఊరేగింపుల నడుమ ఈ కార్యక్రమం ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిపించారు.