సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని కోనసీమ వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలన్నీ ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో మూతపడ్డాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, అయినవిల్లి మండలం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం, మామిడికుదురు మండలం అప్పన్నపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయం, ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను అర్చకులు మూసివేశారు.