ఉల్లికి కనీస మద్దతు ధర రూ.2,500 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 12 గంటలు ఉల్లి రైతులకు మద్దతుగా కర్నూలు మార్కెట్ యార్డ్లో తన కొడుకుతో కలిసి ఆమె పర్యటించారు. రైతులకు నష్టం వస్తే వారిపై పార్టీ ముద్ర వెయ్యడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు వెంటనే ఉల్లి రైతులమీద దృష్టి పెట్టాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.