కాకినాడ నగరంలో స్థానిక సూర్యారావుపేటలో వేంచేసియున్న శ్రీబాల త్రిపుర సుందరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జి తెలిపారు.ఆలయ ప్రాంగణం లోగల చైర్మన్ చాంబర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నూతనంగా నియమించిన ఆలయకమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి,శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ గ్రంథి బాబ్జి మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీన ఉదయం 10:30 లకు శరన్నవరాత్రి మహోత్స