సైబర్ నేరాలు, మోసాలపై రాయదుర్గం మండలంలోని చదం గ్రామంలో సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మంగళవారం సాయంత్రం ఆ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అపరిచితులకు ఓటిపి చెప్పవద్దని సూచించారు. ఏపికె ఫైల్స్ ఓపెన్ చేసి మోసాలకు గురికావద్దని కోరారు. గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.