మహబూబాబాద్ జిల్లా,గూడూరు మండలం,అప్పరాజు పల్లి గ్రామంలో ఓ మిల్లులో విశ్వసినియ సమాచారం మేరకు ఒక లారీ పిడిఎస్ బియ్యం పట్టుకోవడం జరిగిందని,టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ప్రభాకర్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి నిర్వహించి మోపెడు బండ్లతో పాటు లారీ బియ్యం పట్టుకొని, కేసు నమోదు చేసి,విచారణ చేస్థున్నట్లు ఆయన పేర్కొన్నారు. 430 బస్తాల దొడ్డు బియ్యం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.