భీమడోలులో వారాలుపండుగ మహోత్సవం వైభవంగా జరిగింది. భీమడోలు గ్రామంలో తూర్పుకాపు సంఘీయులు ఆధ్వర్యంలో ప్రతీ ఏటా వినాయకచవితి మరుసటి ఆదివారం నిర్వహించే ఈవేడుకకు దేశవిదేశాల నుంచి గ్రామస్థులు హాజరవుతారు. స్థానిక రావిచెట్టు వీధిలోని రామాలయం వద్ద అలంకరించిన ట్రాక్టర్ పై అమ్మవారి ప్రభను ఉంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, శక్తివేషాలు, చిత్రవిచిత్ర వేషాలతో గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు పసుపుకలిపిన నీటిని వారపోసి మొక్కులు తీర్చుకున్నారు.