యాదాద్రి భువనగిరి జిల్లా: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. మంగళవారం బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలో 55 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో హెచ్ఎండిఏ నిధులనుంచి 50 లక్షలు ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి 5 లక్షలు ఉన్నాయని తెలిపారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.