మంగళవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇల్లందు నియోజక వర్గం.. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో ఎస్సై తిరుపతి తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు లగేజీ బ్యాగ్ తో అనుమానాస్పదంగా కనిపించారు. దాంతో వారిని సోదా చేయగా బ్యాగ్ లో 19 kg ల గంజాయి లభించింది. నిందితులను అదుపులో తీసుకొని బయ్యారం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.