తాడిపత్రి పోలీసు స్టేషన్ ఇన్ఛార్జ్ సీఐగా శివ గంగాధర్ రెడ్డిని కేటాయించారు. పట్టణ సీఐగా విధులు నిర్వహిస్తున్న సాయిప్రసాద్ సిక్ లీవ్ లో వెళ్లడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శివగంగాధర్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించారు. సాయిప్రసాద్ రెడ్డి విధులు చేపట్టి ఏడాది అవుతుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఇరువురిపై శ్రీ సాయి ప్రసాద్ కేసులు నమోదు చేశారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు మరికొందరు పై మరో వర్గం పైన కేసులు నమోదు చేశారు. తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితుల్లో సీఐ సిక్లో వెళ్లడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.