ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫామింగ్ కింద కొత్త గ్రామాల ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఇప్పటివరకు 2009 యొక్క గ్రామ సంఘాలలో ప్రకృతి వ్యవసాయం జరుగుతుండగా ఎన్ ఎఫ్ ఎస్ ఎం కింద 726 పంచాయితీలను ఎంపిక చేశామన్నారు.