చిత్తూరు మిట్టూరు ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగుతున్న ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా నివాసం ఉంటున్న వారు విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారం అందజేశారు. అయినా కూడా విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించలేదని స్థానికులు వాపోతున్నారు ఇలాగే గడిస్తే ట్రాన్స్ఫార్మర్ వెళ్లే ప్రమాదం కూడా ఉంటుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది త్వరగా స్పందించాలని విన్నవిస్తున్నారు.