జనగామ జిల్లా: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవల కోసం కృషి చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మారై స్కాన్ కోసం మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని జనగామ అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా ఉండి పనులు జరిగేలా చూస్తామన్నారు .ప్రజలకు ఉచితంగా సిటి స్కాన్ చేసుకునే సదుపాయం కలిగిందని తెలిపారు.