సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని శ్రామిక భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామచందర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి భూ పోరాటాలకు ఆదర్శంగా నిలిచిన ఐలమ్మ స్పూర్తితో నిమ్జ్ భూ నిర్వాసిత రైతులు, కూలీలు పోరాటం చేయాలని సూచించారు.