కడప జిల్లా చక్రాయపేట మండలం లోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో పాపాగ్నిధిలో ఉన్న విద్యుత్ హై టెన్షన్ వైర్లను తొలగించాలని గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం పరిరక్షణ సమితి అధ్యక్షుడు సింగారెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో సుందరంగా ఉన్నటువంటి గండి ప్రాంతం పొల్యూషన్ అయిందని చెప్పారు. గండిలోని రెండు కొండల మధ్య బంగారు తోరణం కనిపించినట్లు కడప గెజిట్లో కూడా ఉందని చెప్పారు. అలాంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో విద్యుత్ హై టెన్షన్ వైర్లను ఇష్టమొచ్చినట్లు వేశారని పేర్కొన్నారు.