కోసిగి: అనుక్షణం పార్టీ కోసం కష్టపడే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం అని మంత్రాలయం సింగిల్ విండో ఛైర్మన్ రామకృష్ణ అన్నారు. ఆదివారం కోసిగి మండలం సాతనూరులో యువ కార్యకర్త ఖాజా బందేనవాజ్ మృతదేహానికి కోసిగి మండల నాయకులతో కలిసి ఆయన నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భోరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.