సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై విస్తృతంగా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ చురుకుగా పని చేయాలని సండ్ర సూచించారు.తరువాత సండ్ర వెంకట వీరయ్య బోసు బొమ్మ సెంటర్ వద్ద మాధురి మధు మెడికల్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంచారు. పర్యావరణహిత వినాయకులను వినియోగించడం ద్వారా ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.