పట్టణంలోని బేస్తవారిపేటలో ఉన్న రెండు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఎన్‌హెచ్‌ఆర్‌సి మంగళవారం ఫిర్యాదు చేసింది. జిలా ప్రధాన కార్యదర్శి శివాజీ గౌడ్ మాట్లాడుతూ రేకుల షెడ్డుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని,డీజే సౌండ్ దుకాణాల పక్కనే తరగతి గదులు ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.