వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరి అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ సమీపంలో మంగళవారం ఫిట్నెస్ లేని మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహన చట్టం ప్రకారం వాహనాలకు ఫిట్నెస్, రోడ్డు టాక్స్, పర్మిట్, పొల్యూషన్, భీమా సౌకర్యం ఉండాలని సూచించారు. లేనట్లయితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.