కడప జిల్లా పరిధిలోని గ్రామపంచాయతీలకు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావలసిన స్టాంప్ డ్యూటీ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రిజిస్ట్రేషన్ లపై వచ్చే స్టాంపు డ్యూటీ ఫీజులను గ్రామపంచాయతీలకు చెల్లించే విషయంలో రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈ కారణంగా పంచాయతీల అభివృద్ధి కుంటుపడిందన్నారు. అలాగే స్టాంప్ డ్యూటీ ఫీజు జ