గణేష్ మండపాలు పెట్టు వారు తప్పనిసరిగా పోలీస్ వారి నుండి అనుమతి పొందాలని గుంటూరు ఈస్ట్ డిఎస్పి అజీజ్ సూచించారు. బుధవారం సాయంత్రం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి సందర్భంగా వినాయక పందిళ్లు ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సీఐ వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి డిఎస్పీ అజీజ్, సీఐ వీరయ్య మాట్లాడుతూ గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసుల నుండి ఫైర్ డిపార్ట్మెంట్, మైక్ పెర్మిషన్ తీసుకోవాలని సూచించారు.