కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పరిధిలోని టెక్కాయ చేను కాలనీ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద చెట్ల పొదలలో భారీ కొండచిలువను గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. గురువారం స్థానికుల వివరాల మేరకు భారీ కొండచిలువను గమనించిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు దానిని చెట్ల పొదల నుండి బయటకు తీసేందుకు ప్రయత్నించగా అది తప్పించుకుని అక్కడే ఉన్న.. చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. కొండచిలువ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొండచిలువను పట్టుకోవాలని స్థానికులు కోరుతన్నారు.