నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం నుంచి ఊట్కూరు వెళ్లే రహదారి ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ఎంపీడీవో తహసిల్దార్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ శాలిగౌరారం నుంచి ప్రధాన రహదారి వెంట వరద ప్రవాహం కొనసాగడంతో వర్ధ ప్రవాహాన్ని అంచనా వేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలని సూచించారు. ఊటుకూరు నుంచి బండమీదిగూడెం వెళ్లే రహదారిని పరిశీలించి నివేదికను అందించాలని ఆదేశించారు.