యాదాద్రి భువనగిరి జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి ధర్మల్ ప్లాంటులో వన మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జన్కో సీఎం డి నవీన్ మిట్టల్ తో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటుగా మార్చుకోవాలని ఆమె సూచించారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.