రాష్ట్రంలో డీఈఓ పూల్‌లో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. రాయచోటిలో పండితులతో సమావేశమైన ఆయన, కోర్టు అనుకూల తీర్పు వచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం త్వరలోనే ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.