ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణపై మంగళవారం మండల అభివృద్ధి అధికారి ఎం.శ్రీనివాసులు పలు కాలనీలను పరిశీలించారు. చెత్త వాహనం వచ్చే రోజుల వివరాలు తెలుసుకొని, ప్రజలు చెత్తను బండీల్లో వేస్తున్నారా అనే అంశంపై స్థితిగతులు అడిగి సమాచారం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో సిఆర్పిలు ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త వేరు చేయాలనే అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.