రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూర్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను మరో భవనంలోకి మార్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. తంగళ్ళపల్లి మండలం మండెపల్లిలోని గురుకుల పాఠశాలను గత రెండు సంవత్సరాలుగా సిరిసిల్ల అర్బన్ పెద్దూర్ లోని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. కాగా ఆ భవనంలో వసతులలేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నరని ఆరోపిస్తూ తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ . . . ఒక్కో రూంలో 70 మంది వరకు విద్యార్థులను పడుకోపెడుతున్నారని, ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురైనా, అది మిగి