మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల ఆట కట్టించుటకు ఆయా గ్రామాలలోని గ్రామస్తులు, గ్రామ పెద్దలతో మరియు యువతతో పోలీసులు సమావేశాలు నిర్వహిస్తున్నారు., ఆస్థి నేరాలు, నివారణ చర్యలు, సైబర్ మోసాల గురించి, గాంజా, ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవగాహన కల్పించారు. గంజాయి అక్రమ రవాణా చేసిన విక్రయాలు జరిపిన కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఉదయం 11 గంటలకు హెచ్చరించారు.