బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కెసిఆర్ కు 60 లక్షల మంది కార్యకర్తలే నిజమైన బిడ్డలని అన్నారు. ఆయన సిద్ధాంతం, క్రమశిక్షణతో పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు. కవిత వ్యాఖ్యలకు స్పందిస్తూ తెలంగాణ ప్రజలు తమ అభివృద్ధి కోసం ఓటు వేస్తారని వెల్లడించారు.