రావులపాలెంలో శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని టౌన్ సీఐ శేఖర్ బాబు తెలిపారు. రావులపాలెం - అమలాపురం రోడ్డులో జెడ్పీ హైస్కూల్ దాటిన తర్వాత కాలువ చెంతన ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. మృతుడి వయసు సుమారు 35 - 40 ఏళ్ల మధ్య ఉంటుందని ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.