విశాఖ నగరంలోని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి వారోత్సవాల సందర్భంగా ఉచిత నేత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాధవధారిలోని రెయిన్బో ఐ హాస్పిటల్స్ సిబ్బంది ఎల్ఐసి కార్యాలయంలోని ఉద్యోగులందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి సిబ్బంది మాట్లాడుతూ ఎల్ఐసి వారోత్సవాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అందులో భాగంగా నేత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు సుమారు 50 నుంచి 60 మంది సిబ్బంది ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పాల్గొన్నట్లు తెలిపారు.