ప్రభుత్వం రెండవ శనివారం అధికారిక సెలవుగా ప్రకటించినప్పటికీ, ప్రైవేటు విద్యా సంస్థలు ఆ రోజు కూడా పాఠశాలలను నడుపుతూ ఉపాధ్యాయులను మానసికంగా హింసిస్తున్నాయని ప్రైవేటు టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో వచ్చే ఒకే ఒక్క శనివారం కూడా సెలవు ఇవ్వకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. అలాగే, వారికి పీఎఫ్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కూడా వర్తించడం లేదన్నారు.