కుందుర్పి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబు ఆధ్వర్యంలో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అద్భుతంగా డాన్స్ చేశారు. తెలుగు భాష గొప్పతనం పై రాసిన పాటకు విద్యార్థులు చక్కగా డాన్స్ చేశారు. డ్యాన్సులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు ప్రదానం చేశారు.